Monday, October 3, 2011

విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదు


దశాబ్దాలు గడుస్తున్నా.. ఎన్ని కమిటీలు, కమిషన్లు వేసినా... ఎన్ని పుస్తకాలు ప్రచురితమైనా... నేతాజీ సుభాష్ చంద్రబోసు చనిపోయారా? జీవించి ఉన్నారా? చనిపోతే ఎలా చనిపోయారు? అనే మిస్టరీ మాత్రం వీడడం లేదు.

అయితే నేతాజీ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ (AHF) లో చేరిన తర్వాత నాలుగేళ్ల పాటు ఆ యోధునికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నిజాముద్దీన్ అనే వ్యక్తి మాత్రం నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని నమ్మశక్యంగా చెబుతున్నారు. విశేషమేమిటంటే 'నేతాజీ మరణం' పై నియమించిన ఏ కమిటీ కాని, కమిషన్ కాని ఇప్పటికీ జీవించి ఉన్న నిజాముద్దీన్ ను కలుసుకుని వివరాలు సేకరించలేదు. 107 ఏళ్ళ నిజాముద్దీన్ ఉత్తర ప్రదేశ్ లోని అజంగడ్ జిల్లా బిలారియాగంజ్ సమీపంలోని ఇస్లాంపుర గ్రామంలో జీవిస్తున్నారు. ఇటీవల స్థానికంగా గల ఒక సంస్థ వాలంటీర్లు నిజాముద్దీన్ ను సన్మానించారు. 1942 లో ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరిన తాను నేతాజీ వద్ద డ్రైవర్ గా బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. 1945 లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదని నిజాముద్దీన్ పేర్కొంటున్నారు. ఈ విమాన ప్రమాదం జరిగిన మూడు నాలుగు నెలల తర్వాత తాను స్వయంగా కారులో నేతాజీని తీసుకెళ్ళానని అయన చెప్పారు. బర్మా, థాయిలాండ్ సరిహద్దుకు సమీపంలోని సిటాంగ్ పుర నది ఒడ్డున తాను నేతాజీని వదలి పెట్టానని వివరించారు. అలాంటప్పుడు అంతకు ముందే జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ ఎలా మరణిస్తారని అయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే నది ఒడ్డున తాను వదలిపెట్టిన తర్వాత ఎమైన్దనేది తనకు తెలియదని అయన పేర్కొన్నారు. నేతాజీతో పాటే ఉంటానని తాను అప్పుడు బలవంతం చేశానని, కాని, భారత్ కు స్వాతంత్ర్యం వచ్చాక తిరిగి కలుస్తానని హామీ ఇచ్చి, వెళ్ళిపోవాలని నేతాజీ తనను ఆదేశించారని
నిజాముద్దీన్ చెప్పారు. తర్వాత తాను నేతాజీని కలుసుకోలేక పోయానని, ఆయనకు సన్నిహితుడైన స్వామి (పూర్తి పేరు ఎస్.వి.స్వామి) ని మాత్రం తిరిగి కలుసుకుని పదేళ్లకు పైగా అవుతోందని తెలిపారు. స్వామి ఎప్పటికప్పుడు నేతాజీతో సంప్రదింపులు జరుపుతుండేవారని వెల్లడించారు.

నిజాముద్దీన్ కు ఇచ్చిన రిఫాట్రిఏషన్ సర్టిఫికెట్ ప్రకారం రంగూన్ లోని పూర్వ ఆజాద్ హింద్ ఫౌజ్, దాని సంబంధిత సంస్థల 'రిలీఫ్ అండ్
రిఫాట్రిఏషన్ కౌన్సిల్' కు చైర్మన్ గా స్వామి వ్యవహరించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో నిజాముద్దీన్ కు గల అనుబంధాన్ని వెల్లడించే ఏకైక పత్రం అతని వట్ట ఉన్న రిఫాట్రిఏషన్ సర్టిఫికెట్. 1969 లో భారత్ కు తిరిగి వచ్చిన నిజాముద్దీన్ దక్వ గ్రామంలోని పూర్వికుల ఇంట్లో కొంతకాలం ఉన్నారు. తర్వాత ఇస్లాంపురకు చేరుకున్నారు.

Source : http://www.lokahitham.net/2011/09/blog-post_3571.html

No comments:

Post a Comment